జంక్షన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2022-11-16T00:36:09+05:30 IST

స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్‌లోని జంక్షన్లు, ప్రధాన ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

జంక్షన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 15: స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్‌లోని జంక్షన్లు, ప్రధాన ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్మార్ట్‌ సిటీ పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేయనున్న ఐడల్స్‌ను ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని రూపొందించాలన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు ఎటువంటి పండగలు కూడా లేనందున పనులను త్వరగా ప్రారంభించి పూర్తిచేసేలా చూడాలని తెలిపారు. అనంతరం కాంట్రాక్టర్లు వివిధ ఐడల్స్‌ ప్రజంటేషన్‌ను అదనపు కలెక్టర్‌కు చూపించగా వాటిలోని డిజైన్లకు డీపీఆర్‌, కొటేషన్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. నగర అభివృద్ధి, స్మార్ట్‌ సిటీ పనుల నిర్వహణలో ఆర్‌అండ్‌బీ ఈఈ, విద్యుత్‌ శాఖలతోపాటుగా వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో వ్యవహరించి పనులు సజావుగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌రావు, మున్సిపల్‌ ఈఈ, డీఈఈ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:36:09+05:30 IST

Read more