ఆంధ్రలో పుంజుకుంటున్న జనసేన, టీడీపీ

ABN , First Publish Date - 2022-10-12T05:53:56+05:30 IST

ప్రస్తుతం ఏపీలో జనసేన, టీడీపీ బాగా పుంజుకున్నా యని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, కేసీఆర్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ ఆంధ్రాలో పోటీచేస్తే వైసీపీకే నష్టమని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేము లవాడలోని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఆంధ్రలో పుంజుకుంటున్న జనసేన, టీడీపీ
కోడెమొక్కు చెల్లించుకుంటున్న సినీనటుడు పృథ్వీరాజ్‌

- సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌ 

వేములవాడ, అక్టోబరు 11: ప్రస్తుతం ఏపీలో జనసేన, టీడీపీ బాగా పుంజుకున్నా యని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, కేసీఆర్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ ఆంధ్రాలో పోటీచేస్తే వైసీపీకే నష్టమని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేము లవాడలోని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నిశ్శబ్ధ విప్లవం రానుందని, ప్రజల్లో అధికార వైసీపీపై తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుందని అన్నారు.  ఆంధ్రాలో మూడు రాజధానుల నిర్ణ యంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూ ర్వకంగా అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాజధాని వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదనీ, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పూర్తిగా కుంటుబడి పోయిందనీ, రౌడీయి జం బాగా పెరిగిపోయిందనీ అన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ 43 స్థానాల్లో అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయిందని, తెలుగుదేశం పార్టీ సైతం అనేక స్థానాల్లో అతితక్కువ ఓట్లతో ఓడిపోయిందని అన్నారు.  ప్రజల్లో తిరుగుతూ చేయని అభివృద్ధి పనిని చేసినట్లు చెప్పాలని ఎమ్మెల్యేలను, మంత్రులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బెదిరిస్తున్నారని, జగన్‌ పరిపాలనలో అసెంబ్లీ కూడా దిగజారుడు రాజకీయాలకు వేదికగా మారిందని అన్నారు. అసభ్య పదజాలాలు వాడిన వారికే మంత్రి పదవులు ఇస్తూ జగన్‌ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం మంత్రి రోజాకు సరికాదని, ప్రతీసారి తిరుమలలో ప్రెస్‌మీట్‌ పెట్టి రాజకీయాలు మాట్లాడే తీరును రోజా మార్చుకోవాలని పృథ్వీరాజ్‌ సూచించారు. 

ఫప్రముఖ సినీనటుడు, జనసేన నాయకుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌ సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని  కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మండపంలో ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వరశర్మ ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. స్థానిక నాయకుడు ఎర్ర శ్రవణ్‌ తదితరులు   ఉన్నారు. 

Read more