రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల కీలకపాత్ర

ABN , First Publish Date - 2022-12-12T00:57:57+05:30 IST

భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల కీలక పాత్ర పోషించనుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవ న్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ త్యాగాల చరిత్ర గాంధీ కు టుంబానిదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీ, కాం గ్రెస్‌ పార్టీదన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల కీలకపాత్ర
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 11: భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల కీలక పాత్ర పోషించనుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవ న్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ త్యాగాల చరిత్ర గాంధీ కు టుంబానిదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీ, కాం గ్రెస్‌ పార్టీదన్నారు. అనాడు అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగితే రాయితీలు కల్పిం చి ప్రజలపై భారం పడకుండా చూసిన ఘనత యూపీఏ సర్కార్‌కు దక్కిందన్నారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న త్యాగాల తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫల మ య్యారని ఆరోపించారు. జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ చక్కెర ఫ్యాక్టరీ ఊసే ఎత్త లేదని, దీంతో రైతులు నైరాశ్యంలో మునిగిపోయారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫ ల్యాలను ఎండగడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉం చుకొని కాంగ్రెస్‌ నాయకలు కలిసి కట్టుగా పనిచేసి, పార్టీ బలోపేతం దిశగా అడుగు లు వేయాలన్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని, భవిష్యత్‌ రాజ కీయాల్లో జగిత్యాల కీలకపాత్ర పోషించనుందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా రెం డోసారి ఎన్నికైన అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ను పార్టీ కార్యకర్తలు, అభిమానులు శాలు వాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ దేవేంధర్‌రెడ్డి, నాయకులు కండ్లపెల్లి దుర్గయ్య, దేవేంధర్‌రెడ్డి, గుండా మధు, ధర రమేష్‌బాబు, మన్సూర్‌, నెహాల్‌, రమేష్‌రావు, మహిపాల్‌, విజయ్‌, మహేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-12-12T00:57:57+05:30 IST

Read more