ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడం శోచనీయం

ABN , First Publish Date - 2022-08-25T05:50:27+05:30 IST

ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకొ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని జిల్లా ప్రధానకార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు.

ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడం శోచనీయం
సిరిసిల్లలో నిరసన దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి

సిరిసిల్ల రూరల్‌, అగస్టు 24: ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకొ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని జిల్లా ప్రధానకార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని డాక్టర్‌ బీఅర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బీజేపీ నాయకులు నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడతూ  బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న ఆదరణనుచూసి జీర్ణించుకోలేక పాదయాత్రను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజాసంగ్రామ పాదయాత్రకు అనుమతులు ఇవ్వ డంతోపాటు లిక్కర్‌ కేసులో ఉన్న కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్థన్‌, కౌన్సిలర్‌లు బోల్గం నా గరాజుగౌడ్‌, భాస్కర్‌, ఠాకూర్‌రాజుసింగ్‌, కైలాస్‌, వంగ అనిల్‌కుమార్‌, పెరుమాండ్ల ప్రవీణ్‌కుమార్‌, మేకల కమలాకర్‌, కంచర్ల పర్శరాములు పాల్గొన్నారు. 

Read more