-
-
Home » Telangana » Karimnagar » Interest free loans should be given to farmers-NGTS-Telangana
-
రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-07-18T06:36:45+05:30 IST
రైతులకు రెండు లక్షల రూపాయాల వరకు వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మల్లాపూర్, జూలై 17 : రైతులకు రెండు లక్షల రూపాయాల వరకు వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయన ఆదివారం మొగిలిపేటతో పాటు పలు గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రైతు సంతకాలు సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మొగిలిపేట ప్రధాన కూడలి వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏక కాలంలో లక్ష వరకు రుణం మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేసి బాధిత రైతులను ఆదుకోవాలన్నారు. వర్షాలతో నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొట్టు నర్సయ్య, మోకు రాజేందర్‌లతో పాటు పలువురు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.