సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముస్తాబు చేయాలి
ABN , First Publish Date - 2022-11-30T00:05:57+05:30 IST
జిల్లా కేంద్రంలో నిర్మాణం పూ ర్తి చేసుకున్న సమీకృత కలెక్టరేట్ భవనంలో ప్రతీ అంగుళాన్ని శుభ్రం చే సి ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలని కలెక్టర్ గుగులోతు రవి నా యక్ అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్ గుగులోతు రవి నాయక్
జగిత్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్మాణం పూ ర్తి చేసుకున్న సమీకృత కలెక్టరేట్ భవనంలో ప్రతీ అంగుళాన్ని శుభ్రం చే సి ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలని కలెక్టర్ గుగులోతు రవి నా యక్ అధికారులను ఆదేశించారు. త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటిం చే అవకాశం ఉన్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని నూతన సమీ కృత కలెక్టరేట్ భవనాన్ని సందర్శించారు. కలెక్టరేట్లోని పలు విభాగాలను పరిశీలించారు. ఈసందర్బంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయినందున ప్రతి గదిని వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలన్నింటిని పచ్చదనంతో ఆహ్లాదంగా ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రా రంభోత్సవం జరిగిన రోజు నుంచే ఆయా శాఖల కార్యకలపాలన్ని కొత్త భ వనం వేధికగానే జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద నపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరందు, ఆర్డీవో మాదురి, మున్సిపల్ డీఈ గంగారాం, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read more