ఆదాయ మార్గాలను అన్వేషించాలి

ABN , First Publish Date - 2022-07-04T05:15:56+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు అన్ని రకాలుగా మార్గాలు అన్వేషించాలని రామగుండం మేయర్‌ బంగి అనీల్‌కుమా ర్‌ పారిశుధ్య ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లను ఆదేశించారు.

ఆదాయ మార్గాలను అన్వేషించాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌

- పారిశుధ్య సమీక్షలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌

కోల్‌సిటీ, జూలై 3: రామగుండం నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు అన్ని రకాలుగా మార్గాలు అన్వేషించాలని రామగుండం మేయర్‌ బంగి అనీల్‌కుమా ర్‌ పారిశుధ్య ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. ఇందులో భాగంగా నగరం లోకి వస్తువులను తీసుకువచ్చి, తీసుకువెళ్లే లారీలపై రూ.100చొప్పున రుసుము వసూలు చేయాలని సూచించారు. ఆదివారం తన చాంబర్‌లో జరిగిన సమీక్ష సమా వేశంలో ఆయన మాట్లాడారు. తైబజార్‌ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని, అందువల్ల సిబ్బందే నేరుగా వసూళ్లకు దిగాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీనగర్‌, కల్యాణ్‌నగర్‌, కూరగాయ మార్కెట్లకు సరుకులు తీసుకువచ్చే లారీలకు ఒక్కో లారీ కి రూ.100చొప్పున వసూలు చేయాలని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యూరియా తీసుకువె ళ్లే లారీలకు కూడా రూ.100పన్ను విధించాలన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనధికంగా పెట్టిన, రోజుల తరబడి ఉంచి ఫ్లెక్సీలను పారిశుధ్య సిబ్బందితో తొలగిం చాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పారిశుధ్య సిబ్బందిదేనని, ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. నగరంలో ప్రధాన రహదారులపై చెత్త కనబడుతోందని, ఎవరుపడితే వారు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకముందే చెత్త ను తొలగించాలని ఆయన పారిశుధ్య ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్యాంసుందర్‌, నాగభూషణం, కార్పొరేటర్‌ బాల రాజ్‌కుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Read more