నరసింహుడి సన్నిధిలో ఆర్‌ఈసీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పూజలు

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్‌ రూరల్‌ ఎలక్ట్రీఫికేషన్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మణాచార్యులు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం సందర్శించారు.

నరసింహుడి సన్నిధిలో  ఆర్‌ఈసీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పూజలు
లక్ష్మణాచారార్యులను సత్కరిస్తున్న ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు

ధర్మపురి, అక్టోబరు 8: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్‌ రూరల్‌ ఎలక్ట్రీఫికేషన్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మణాచార్యులు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి వేద పండితులు, అర్చకులు, సిబ్బంది సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనం తరం ఆయన స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, రమణాచార్యా, నరసింహమూర్తి, అర్చకులు వారిని ఘనంగా ఆశీర్వదించారు. ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య వారికి స్వామి శేష వస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు బహు కరించి సత్కరించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో ధర్మపురి ఏడీఈ సింధూర్‌శర్మ, ఏఈఈ మనోహర్‌, ఆలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more