‘ట్రిపుల్‌ ఐ’పై దృష్టిసారిస్తే అగ్రశ్రేణిలో నిలుస్తాం

ABN , First Publish Date - 2022-08-16T06:21:58+05:30 IST

‘ఇన్నోవేషన్‌, ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూసీవ్‌గ్రోత్‌’ అనే మూడు అంశాలపై (ట్రిపుల్‌ ఐ) దృష్టిసారిస్తే భారత దేశం అగ్ర దేశాల సరసన నిలుచుంటుందని పురపాలక, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు.

‘ట్రిపుల్‌ ఐ’పై దృష్టిసారిస్తే అగ్రశ్రేణిలో నిలుస్తాం
విద్యార్థులతో గూగుల్‌ మీట్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌

సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ‘ఇన్నోవేషన్‌, ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూసీవ్‌గ్రోత్‌’ అనే మూడు అంశాలపై (ట్రిపుల్‌ ఐ) దృష్టిసారిస్తే భారత దేశం  అగ్ర దేశాల సరసన నిలుచుంటుందని  పురపాలక, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో  ఇం టింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌-2022ను ప్రారంభించారు. అనం తరం  ఎంపిక చేసిన 33 జిల్లాల ఆవిష్కరణల ఆవిష్కర్తలతో సిరిసిల్ల కలెక్టరేట్‌ నుంచి గూగుల్‌మీట్‌ ద్వారా మాట్లాడి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సృజ నాత్మకత నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా ఎంపిక చేసిన ఆవిష్కరణలు తోటి భార తీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దు కున్నాయన్నారు. అందుకు ఉదాహరణ సిరిసిల్ల జిల్లా నుంచి ఎంపికైన ప్రదర్శనలే చక్కని ఉదాహరణ అని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్స హించ డంలో ముందుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌, వీ హబ్‌, అగ్రి హబ్‌, కే హబ్‌ అనేక కొత్త ఆవిష్కరణలకు వేదికలు అవుతున్నాయన్నారు. సమ్మిళిత అభివృద్ధిలో తెలంగాణ దేశానికి చిరానామాగా ఉందని, అభి వృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక సాగు ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో 107 శాతం వ్యవసాయ విస్తరణ జరిగిందని, గ్రీన్‌కవర్‌ 7.7 శాతం పెరిగిందని అన్నారు. టాలెంట్‌ ఎవ్వరి అబ్బ సొత్తు కాదని, యువతను సరైన పంథాలో వెళ్లేలా మార్గదర్శనం చేస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే దేశానికే ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా ఇండియా మారుతుందన్నారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే,  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ అధికారి డాక్టర్‌ శాంత తౌటమ్‌, జీఎం ఇంటస్ట్రీస్‌ అధికారి ఉపేందర్‌రావు, డీఈవో రాధాకిషన్‌, డీఎస్‌వో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:21:58+05:30 IST