నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం

ABN , First Publish Date - 2022-10-04T06:38:58+05:30 IST

నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిపక్ష నాయకులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హెచ్చరించారు.

నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 3: నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిపక్ష నాయకులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సాక్ష్యాధారాలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని లేదంటే కోర్టుకు వెళ్లాలని అనాగరికథ కాలంనాటి ప్రమాణాలతో సవాళ్లు నడవువని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే అన్నారు.  వాస్తవాలను అబద్దాలను నిజాలుగా నమ్మిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. అసలు ఏనాడు నీగురించి మాట్లాడే అవసరం లేదని కేవలం నియోజకవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద ఓవర్‌ లోడ్‌ లారీలతో రోడ్డు ధ్వంసం అయ్యిందని 16 కోట్లు మంజూరు చేసి టెండర్లు కూడా అప్పగించినట్లు రేపో మాపో పనులు ప్రారంభమయ్యే సమయానికి పాదయాత్ర చేపట్టడం సిగ్గు చేటన్నారు. మానేరు పరివాహక ప్రాంత ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సాండ్‌ టాక్స్‌ విధానం రాష్ట్రమంతటా ఉందన్నారు. దమ్ముంటే ఇసుక రీచ్‌లను, లారీలను అడ్డుకో లేదంటే ఆధారాలుంటే కోర్టుకెళ్లాలని మాజీ ఎమే్ముల్యెకు సూచించారు. గతంలో కూడా అవినీతి నిరూపిస్తే ముక్కు భూమికి రాయాలని సవాల్‌ చేసి వెనక్కి తగ్గాడన్నారు. వాస్తవాలు తెలియకుండా నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేయడం  అలవాటుగా మారిందన్నారు. ప్రజలు గమినించే రెండు సార్లు ఓడించినా సిగ్గు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణం చేస్తే సరిపోతే  పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాలుగు వందల మందిని అదుపులోకి తీసుకుంటే కాంగ్రెస్‌ వారిని కేవలం 100 మందిని కూడా ముందస్తు అరెస్టు చేయలేదన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా వారు వారి చర్యలు తీసుకోవడం సహజమన్నారు. పెద్దపల్లిలో రియల్‌ ఎస్టేట్‌ పడి పోలేదని జిల్లా కేంద్రం కావడంతో వందలాది ఏకరాలు లేఅవుట్లుగా మారాయన్నారు. పదవి లేక ఫ్రస్టేషన్‌ గురై అడ్డగోలుగా మాట్లాడితే అదే స్థాయిలో మేం తిరుగబడుతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే  హయాంలో జరిగిన అభివృద్ధిపై, నా హయాంలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రాలు విడుదల చేద్దామని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారు రాంమూర్తి, బండారి శ్రీనివాస్‌, కొంకటి లింగమూర్తి ఉప్పు రాజ్‌కుమార్‌, పురుషోత్తం, వెన్నం రవీందర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-10-04T06:38:58+05:30 IST