ఎల్‌ఎండీకి భారీ ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-09-11T06:18:32+05:30 IST

భారీ వర్షాలతో కరీంనగర్‌ సమీపంలోని లోయర్‌ మానేరు డ్యాంకు (ఎల్‌ఎండీ) ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది.

ఎల్‌ఎండీకి భారీ ఇన్‌ఫ్లో
ఎల్‌ఎండీ 8గేట్ల ద్వారా దిగువకు విడుదల అవుతున్న నీరు

- ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

తిమ్మాపూర్‌, సెప్టెంబరు 10: భారీ వర్షాలతో కరీంనగర్‌ సమీపంలోని లోయర్‌ మానేరు డ్యాంకు (ఎల్‌ఎండీ) ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా శనివారం ఉదయం 23 టీఎంసీలకు చేరుకుంది. దీంతోనీటి పారుదల శాఖ అధికారులు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో క్రమంగా పెరిగి రాత్రి తొమ్మిది గంటలకు 43,309 క్యూసెక్కులకు పైకి చేరుకుంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్‌ఎండీ పూర్తి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా రాత్రి తొమ్మిది గంటల వరకు 23.258 టీఎంసీలకు చేరుకుంది. మోయతుమ్మెద వాగు నుంచి 24,149 క్యూసెక్కులు, శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి 17,760, ఎగువ కాకతీయ కాలువ నుంచి 1,400, మొత్తం 43,309 క్యూసెకుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వస్తోంది. 10 గేట్లు, దిగువ కాకతీయ కాలువ ద్వారా 43,309 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


Read more