కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడు

ABN , First Publish Date - 2022-12-10T00:38:08+05:30 IST

ఎన్నికల సమయంలో సీఎం ఏసీఆర్‌ ప్రజలకు ఇ చ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్ర శ్నించారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ..కేసీఆర్‌ నోటికి కోతలెక్కువ అని విమర్శించారు. ఐదవ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం మెట్‌పల్లిలో 12వ రోజు పాదయాత్రను నిర్వహించారు.

కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడు
మెట్‌పల్లిలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

కేసీఆర్‌ నోటికి కోతలెక్కువ

షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేనోడు రాష్ట్రాన్ని ఎలా ఏలుతాడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

మెట్‌పల్లి, డిసెంబరు 9 : ఎన్నికల సమయంలో సీఎం ఏసీఆర్‌ ప్రజలకు ఇ చ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్ర శ్నించారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ..కేసీఆర్‌ నోటికి కోతలెక్కువ అని విమర్శించారు. ఐదవ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం మెట్‌పల్లిలో 12వ రోజు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కి మహిళలు పూలను అందిస్తూ బొట్టుపెట్టి మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని గంగపుత్రులు మద్దతు తెలుపుతూ స్వాగతించారు. చావిడి వద్ద అబేంద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏబీవీపీ కార్యకర్త మధుసూదన్‌గౌడ్‌ మృతి చెందగా చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాత బస్టాండు చేరుకున్న అ నంతరం అక్క ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. తాను ఏబీపీ కార్యకర్తగా ఉన్నప్పుడు మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌ ఎక్కువగా తిరిగానన్నారు. విద్యారంగ సమస్యల కోజం యుద్ధం చేసి, నక్సలైట్ల చేతిలో అమరుడైన పుదారి మధుసూదన్‌గౌడ్‌ బాడీలో బుల్లెట్‌ దిగినా భారత్‌ మాతాకీ జై అంటూ ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులు బీజేపీ వాళ్లు అన్నారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రకటనతో తెలంగాణకు పట్టిన పీడ నేటితో విరగడైందన్నారు. ఇక్కడ ఏం చేయలేని వ్యక్తి దేశంలో ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. 30, 40గ్రామాలకు ఉచితంగా వాడే కరెంటును కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు ఫ్రీగా వాడుకుంటున్నాడని సంజయ్‌ ఆరోపించారు. తం డ్రికి ఇష్టమైన వ్యాపారం చేయాలని ఢిల్లీలో కవిత లిక్కర్‌ దందా చేయడానికి కోట్ల రూపాయలు పెట్టిందన్నారు. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేనోడు రాష్ట్రాన్ని ఎలా ఏలుతాడని, షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించడం తమ వల్ల కాదని సీఎం రాసిస్తే ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. కేసీఆర్‌ను ఎన్ని తిట్టినా తనకు గురువు కేసీఆరే అని వెటకారం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. బీఆర్‌ఎస్‌ ఎప్పటికి బంధిపోట్ల రాష్ట్ర సమితి పార్టీ అని సంజయ్‌ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని సాధించుకుంటే మూర్ఖుడి పాలనలో ధనికంగా ఉన్నదాన్ని 5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చాడని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసిండని, రాష్ట్రానికి 575టీఎంసీల నీరు రావాల్సి ఉంటే 299టీఎంసీలకే సంతంకం చేసి తెలంగాణ నోట్లో మన్ను కొట్టాడన్నారు. సమైక్యవాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి దావత్‌ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్‌ అని అలాంటి వ్యక్తి మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, తెలంగాణలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా సంజయ్‌ అన్నారు. అనంతరం పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జీ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర మహిళ నాయకురాలు తుల ఉమ, పూదరి అరుణ, ఏలేటి ముత్యంరెడ్డి, గాజంగి జయకృష్ణ, కొమ్ముల రాజ్‌పాల్‌రెడ్డి, బోగ గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:38:10+05:30 IST