ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-12T00:54:22+05:30 IST

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముం దుకు సాగుతోందని ఎంపీపీ రేణుక, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు

 ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
చెక్కులను అందజేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

ఎల్లారెడ్డిపేట, డిసెంబరు 11: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముం దుకు సాగుతోందని ఎంపీపీ రేణుక, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోం దన్నారు. పేదల వైద్యానికి అధిక నిధులు కేటాయిస్తోందన్నారు సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి, అనసూయ, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, బాలమల్లు, నర్సింహారెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, లక్ష్మన్‌, పర్శరాములు, సందీప్‌, కల్యాణ్‌, దేవేందర్‌, కిషన్‌, అజీమొదీన్‌, హసన్‌, సాయి, దేవదాస్‌, అప్సరున్నీసా, లావణ్య, అంజలి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:54:22+05:30 IST

Read more