ఘనంగా కొత్త జయపాల్‌రెడ్డి జన్మదినం

ABN , First Publish Date - 2022-10-02T06:06:01+05:30 IST

మైత్రి గ్రూప్‌ చైర్మన్‌ కొత్త జయపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగ జరిగాయి.

ఘనంగా కొత్త జయపాల్‌రెడ్డి జన్మదినం
కేక్‌ కట్‌ చేస్తున్న సృజన్‌రావు

గణేశ్‌నగర్‌, అక్టోబరు1: మైత్రి గ్రూప్‌ చైర్మన్‌ కొత్త జయపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగ జరిగాయి. కొత్త జయపాల్‌రెడ్డి మిత్ర మండలి సభ్యులు నగరంలోని తెలంగాణ చౌక్‌లో భారీ కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తజయపాల్‌రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు దువ్వంతల లక్ష్మారెడ్డి, గుర్రం రాజిరెడ్డి, మైత్రి ఛానల్‌ ఎండీ సుజన్‌రావు, డైరెక్టర్‌ ఏనుగు తిరుపతిరెడ్డి, అమ్ము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సుజాతరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి జయపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్‌ఎండీ లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మిత్రమండలి ఆధ్వర్యంలో వాకర్స్‌కు జావ పంపిణీ చేశారు. నగరంలోని గాంధీ రోడ్‌లోని వృద్ధాశ్రమంలో సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు గుర్రం పద్మారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. నగరంలోని మంకమ్మతోట ఓల్డ్‌ లేబర్‌ అడ్డా వద్ద శ్రీరాముల జయపాల్‌ ఆధ్వర్యంలో, భగత్‌నగర్‌ హరిహర అయ్యప్ప క్షేత్రంలో బాల్య మిత్రుల ఆధ్వర్యంలో జయపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని కార్ఖానగడ్డ ఓల్డేజ్‌హోమ్‌లో శ్రీశిల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. మంచిర్యాల చౌరస్తాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నాగారం సత్యనారా యణ యాదవ్‌ పాల్గొన్నారు. నగరంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీ వీరబ్రహ్మం గారి అనాథాశ్రమంలో మిత్రమండలి సభ్యులు రామాంజ నేయులు ఆధ్వ ర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీలో మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 

వృద్ధులకు బ్లాంకెట్ల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌: కొత్త జయపాల్‌ రెడ్డి జన్మదిన వేడుకలను సహాయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకు రాలు గుర్రం పద్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ రోడ్‌లోని ప్రభుత్వ వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జయపాల్‌రెడ్డి నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. 

ఫగంగాధర: గంగాధరలో మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు కొత్త జయపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గట్టుబూత్కుర్‌లో సర్పంచ్‌ కంకణాల విజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం గ్రామంలో పండ్లు పంపిణీ చేశారు. లక్ష్మిదేవిపల్లి, గంగాధర, బూరుగుపల్లి, కాసారం, గర్షకుర్తి, వెంకంపల్లి గ్రామాల్లో మిత్రమండలి ఆధ్వర్యంలో జయపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. 

Read more