ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-16T06:03:14+05:30 IST

జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, అన్ని పాఠశాలల్లో ప్రజాప్రతినిధు లు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు.

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
గోదావరిఖనిలో జెండా ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి

- జాతీయ జెండాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 15: జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, అన్ని పాఠశాలల్లో ప్రజాప్రతినిధు లు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ జాతీయజెం డాను ఆవిష్కరించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయం, సుభాష్‌ నగర్‌ విగ్రహం, ట్రినిటి విద్యాసంస్థల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి,  నగర కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, పట్టణంలోని మజీవ్‌, శివాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య, బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి,  సీపీఎం ఆఽధ్వర్యంలో పార్టీ జిల్లా నాయకుడు కల్లెప ల్లి అశోక్‌, జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు భోజన్నపేట రాజయ్య స్మారక పుస్తకాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మఽధు ఆవిష్కరించారు.  ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యాక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా సైన్స్‌ అధికారి రఘునందన్‌రావును కలెక్టర్‌ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో జరిగిన వేడుకల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పాల్గొన్నారు. 


Read more