ఘనంగా కళోత్సవం

ABN , First Publish Date - 2022-10-01T05:09:41+05:30 IST

కరీంనగర్‌ కళోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకకు వేదికగా నిలిచిన అంబేద్కర్‌ స్టేడియం సందడిగా మారింది.

ఘనంగా కళోత్సవం
సినీ నటుడు శ్రీకాంత్‌ను సత్కరిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్‌, నాయకులు

 జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

 కనువిందు చేసిన క్రాకర్స్‌ షో

 హాజరైన సినీ నటులు, యాంకర్లు

 కళాకారులో సందడిగా మారిన కరీంనగర్‌

 కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 30: కరీంనగర్‌ కళోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  వేడుకకు వేదికగా నిలిచిన అంబేద్కర్‌ స్టేడియం సందడిగా మారింది. శుక్రవారం ఉత్సవాలను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. సినీ నటులు శ్రీకాంత్‌, తరుణ్‌, నటి రోజారమణి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కేసీఆర్‌పై చిత్రీకరించిన పాటతో ప్రారంభమైన వేడుకలకు యాంకర్‌ శివజ్యోతి (సావిత్రి) వ్యాఖ్యానం చేశారు. ప్రదర్శనలను తిలకించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కళోత్సవాల నిర్వాహకుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగులకమలాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాల్గొన్న కళాకారులను ప్రశంసించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఇదే ఉత్సహంతో రాబోయే రెండు రోజులు ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. శని, ఆదివారాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

 

 అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు


రాష్ర్టానికి చెందిన కళాకారులు మిట్టపెల్లి సురేందర్‌, మధుప్రియ, నాగదుర్గ, మౌనికా యాదవ్‌, బుల్లెట్‌ భాస్కర్‌, నరేశ్‌, జానులిరి, శేఖర్‌, జోగుల వెంకటేశ్‌, నక్క శ్రీకాంత్‌, చంద్రవ్వ, కొమురవ్వ వారివారి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇజ్రాయిల్‌, ఇండోనేషియా, మలేషియా, అండమాన్‌ నికోబార్‌తోపాటు 19 రాష్ర్టాలకు చెందిన కళాకారులు వారి సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు రసమయిబాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీనారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, సీపీ సత్యనారాయణ, తెలంగాణ ఈవెంట్ప్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, జిల్లా సంగీత, ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోగుల ప్రసాద్‌తో పాటు నగరవాసులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:09:41+05:30 IST