ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-03T00:21:14+05:30 IST

వానా కాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
హుజూరాబాద్‌లో దళితబంధు యూనిట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానా కాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో 2022-23 వానా కాలం ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్‌ మిల్లర్‌, లారీ అసోసియేషన్‌ ప్రతి నిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 4.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగు బడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందుకు అనుగుణంగా ఐకేపీ ద్వారా 58, పీఏసీ ఎస్‌ ద్వారా 237, డీసీఎంఎస్‌ ద్వారా 53, హాక ద్వారా ఒకటి, మొత్తం జిల్లాలో 349 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే 80 కేంద్రాల ను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లను చేపట్టామన్నారు. కొనుగోలు కేంద్రా ల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యం అన్‌లోడింగ్‌లో మిల్లర్లు ఇబ్బం దులు కలుగ చేయవద్దని, తాలు, ఎఫ్‌ఏక్యూ పరిమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ధాన్యం పంపిస్తారని, కాబట్టి తరుగును తీసివేయ వద్దన్నారు. ధాన్యం తరలింపునకు వినియోగించే వాహనాలు రోడ్లపై వేచి ఉండ కుండా కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో అవసరం మేర కూలీలను ఏర్పాటు చేసుకొని లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ వెంటనే జరిగేలా చూడాలని, ట్యాబ్‌లో ఎంట్రీ వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. అవసరం మేరకు మిల్లర్లు, లారీ అసోసియేషన్‌ వారితో ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. డీసీవో, డీఆర్‌డీవో పీడీలు ప్రతీ కొనుగోలు కేంద్రం వారీగా ధాన్యం ఎఫ్‌ఏక్యూ పరిమాణాల పరిశీలనను పర్యవేక్షిం చాలని సూచించారు. జిల్లాలోని హార్వెస్టింగ్‌ వాహనాలు బయటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, డీఆర్‌డీవో పీడీ శ్రీలత, డీసీవో శ్రీమాల, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్‌, జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ ఎ సుధాకర్‌ రావు, వైస్‌ ప్రెసిడెంట్‌ కరుణాకర్‌ పాల్గొన్నారు.

దళితబంధు యూనిట్ల పరిశీలన

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ పట్టణంలో దళితబంధు పథకం కింద మంజూరైన లక్ష్మి గణపతి ఎంటర్‌ ప్రైజెస్‌ యూనిట్‌ను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపార లావాదేవీలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి దశలో యూనిట్‌కు ఐదు లక్షల రూపాయలు ఇచ్చామని, మిగితా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. దళితబంధులో మంజూరైన యూనిట్లతో దళితులు ఆర్థికంగా ఎదగాలన్నా రు. అర్హులైన వారందరీకి దళితబంధు అందజేస్తామన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి సురేష్‌, ఈడీ నాగార్జున, జిల్లా సహకార అధికారి శ్రీమాల కమిషనర్‌ సమ్మయ్య ఉన్నారు.

Updated Date - 2022-11-03T00:21:17+05:30 IST