గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-12-30T00:00:14+05:30 IST

గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని దేశ ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాయ కులు కళ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి
సిరిసిల్లలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 29: గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని దేశ ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నాయ కులు కళ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు దోచి పెడుతోందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల చట్టాలను కుదించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పంతం రవి, మంచికట్ల రమేష్‌, నాగరాజు, పరశురాములు, బుర్ర మల్లేశం, నారాయణ, బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:00:19+05:30 IST

Read more