రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-20T23:26:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ అన్నారు చందుర్తి మండలం మర్రిగడ్డలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు.

రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఆది శ్రీనివాస్‌

చందుర్తి, నవంబరు 20: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ అన్నారు చందుర్తి మండలం మర్రిగడ్డలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేపడుతున్నారని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు దాటినా 25 శాతం కొనుగోళ్లు కూడా జరగడం లేదన్నారు. లారీల కొరత ఉంటే ఇసుక, మద్యం తరలించే టిప్పర్లను ధాన్యం తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. అధిక తూకం వేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పాలకులకు పార్టీ పదవులపై, నియామకాలపై ఉన్న శ్రద్ద రైతులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్‌, నాయకులు చింతపంటి రామస్వామి, మ్యాకల గణేష్‌, వేల్పుల దేవస్వామి, గొట్టె ప్రభాకర్‌, పులి సత్తయ్య, ధర్మపురి శ్రీనివాస్‌, బానాల రవీందర్‌రెడ్డి, బీమరాజు కనకరాజు, బొజ్జ మల్లేశం, సంటి ఏసుదాసు, అంచ రాంసుందర్‌రెడ్డి, ఇందూరి మధు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T23:26:03+05:30 IST

Read more