అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండ

ABN , First Publish Date - 2022-07-05T05:40:30+05:30 IST

అణుగారినవర్గాలకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని కందికట్కూర్‌లో సోమవారం సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు.

అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండ
సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే

ఇల్లంతకుంట, జూలై 4: అణుగారినవర్గాలకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని కందికట్కూర్‌లో సోమవారం సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం  కింద వైద్యం అందించడంతోపాటు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వచ్చినా ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారన్నారు. అంతకుముందు మండలంలోని వల్లంపట్లకు చెందిన ప్యాక్స్‌ డైరెక్టర్‌ కట్ట సుధాకర్‌రెడ్డితోపాటు పలు కుటుంబాలను పరామర్శించారు. మహిళలు, వృద్ధులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.  జడ్పీవైస్‌ చైర్మెన్‌ సిద్దం వేణు, సెస్‌డైరెక్టర్‌ గుడిసె అయిలయ్య, సర్పంచ్‌లు కేతిరెడ్డి అనసూయనర్సింహరెడ్డి, ముత్యం అమర్‌గౌడ్‌, ఎంపీటీసీ నాయిని స్రవంతిరమేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మెన్‌ రొండ్ల తిరుపతిరెడ్డి, నాయకులు తూటి పర్శరాం, పెద్గి రాజుయాదవ్‌, రంగు రజనీకాంత్‌, కనుకయ్య, కొమురయ్య, అనీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని లబ్ధిదారు  ముత్యాల హస్నికకు మంజూరైన రూ.2లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును సర్పంచ్‌ నర్సాగౌడ్‌ సోమవారం అందజేశారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఉప సర్పంచ్‌ ఉస్మాన్‌, నాయకులు దేవరాజు, సురేశ్‌, అంజయ్య, తిరుపతి, స్వామి, శ్రీను, బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:40:30+05:30 IST