గాడ్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌... ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-03-18T06:14:10+05:30 IST

‘గాడ్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌... ఫ్యూఛర్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌... సీఎం కేసీఆర్‌ పుట్టిన పవిత్రమైన తెలంగాణ గడ్డపై నేను కూడా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా’ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

గాడ్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌... ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ కేటీఆర్‌

-మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 17: ‘గాడ్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌... ఫ్యూఛర్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌... సీఎం కేసీఆర్‌ పుట్టిన పవిత్రమైన తెలంగాణ గడ్డపై నేను కూడా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా’ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మార్కెట్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా నిధులు ఇవ్వాలని కోరితే ఒక్క రూపాయి ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలతో కరీంనగర్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏడు సంవత్సరాల్లో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థులు బయటి దేశాలకు తరలి వెళ్లకుండా చేశారన్నారు. వేంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని కేటాయించారన్నారు. త్వరలో పనులు  ప్రారంభిస్తామన్నారు.  మనం ఒక్కో చేయి కలిపి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను బలోపేతం చేయాలన్నారు. 

  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని నీతిఅయోగ్‌ నివేదికలు చెబుతున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఆరోపణలు చేయడం కాదు నిజాలు నిరూపించాలన్నారు. ఉద్యమ కాలంలోనే కేసీఆర్‌ అభివృద్ధిపై ఆలోచనలు చేశారన్నారు. మానేరు నదిపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణంతో వరంగల్‌, హుజూరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు అద్భుతమైన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో రవాణా సౌలభ్యం సమకూరిందన్నారు.

Read more