వైభవంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-02T06:03:07+05:30 IST

కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

వైభవంగా సద్దుల బతుకమ్మ
బొమ్మకల్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

- పలు గ్రామాల్లో ఏడు రోజులకే వేడుకలు

కరీంనగర్‌ రూరల్‌, అక్టోబరు 1: కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫ్‌నగర్‌లో ఎంపీపీ పిల్లి శ్రీలతమహేష్‌, కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రెడ్డవేణి మధు సుప్రియ దంపతులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ సభ్యురాలు పురమల్ల లలిత నెత్తిన బతుకమ్మ ఎత్తుకుని వేడుకల్లో పాల్గొనగా, సర్పంచ్‌ పురమల్ల శ్రీనివాస్‌ బతుకమ్మ ఏర్పాట్లు చేసి వేడుకల్లో పాల్గొన్నారు. బొమ్మకల్‌లో ఎంపీటీసీ సభ్యురాలు ర్యాకం లక్ష్మీమోహన్‌ పటేల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఉదయం నుండే బతుకమ్మ సందడి కనిపించింది. గడప గడపలో రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను పేర్చి గ్రామ కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ పాటలతో అలరించారు. రాత్రి వేళలో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా  నిర్వహించారు. కరీంనగర్‌ బస్టాండ్‌ ఆవరణలో కరీంనగర్‌-1, 2 డిపోల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.   


Read more