ప్రాజెక్టుల కోసం భూములు ఇవ్వం

ABN , First Publish Date - 2022-01-23T06:12:15+05:30 IST

రామడుగు మండలం షానగర్‌ గ్రామంలో అదనపు టీఎంసీ కోసం చేపట్టిన భూ సర్వేను గ్రామస్థులు అడ్డుకున్నారు.

ప్రాజెక్టుల కోసం భూములు ఇవ్వం
షానగర్‌లో గ్రామ సభ సర్వేను అడ్డుకుంటున్న నిర్వాసితులు

షానగర్‌లో సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు

  రామడుగు, జనవరి 22: రామడుగు మండలం షానగర్‌ గ్రామంలో అదనపు టీఎంసీ కోసం చేపట్టిన భూ సర్వేను  గ్రామస్థులు అడ్డుకున్నారు. కాలువ నిర్మా ణంలో ఇదివరకే తమ భూములు కోల్పోయామని, మరోసారి ప్రాజెక్టుల పేరిట  ప్రభుత్వం భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, డీఈ విష్ణుప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Read more