గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T05:58:26+05:30 IST

సిరిసిల్ల పట్టణంలో ఈనెల 9న మానేరు వాగులో గణేశ్‌ నిమజ్జన కార్య్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. బుధవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండ పంలో గణేశ్‌ ఉత్సవసమితి నిర్వాహకులు, మైనా రిటీ నాయకులతో శాంతికమిటీ సమావేశం నిర్వ హించారు.

గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 7:  సిరిసిల్ల పట్టణంలో ఈనెల 9న మానేరు వాగులో గణేశ్‌ నిమజ్జన కార్య్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. బుధవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండ పంలో గణేశ్‌ ఉత్సవసమితి నిర్వాహకులు, మైనా రిటీ నాయకులతో శాంతికమిటీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1914 గణేశ్‌విగ్రహాలను ప్రతిష్ఠిం చారని, ఇందులో  సిరిసిల్ల పట్టణంలో దాదాపు 580 వినాయక ప్రతిమలు ఉన్నాయని తెలిపారు. మానేరు వాగు వద్ద ఐదు క్రేన్‌లు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తామన్నారు. చేనేత చౌక్‌ నుంచి గాంధీచౌక్‌, పోలీస్‌స్టేషన్‌ వరకు  ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేస్తామన్నారు. ఇందుకోసం బైపాస్‌ రహదారుల నుంచి వాహనాలను మళ్లిం చాలన్నారు. గణేశ్‌ శోభాయాత్రకు ఇబ్బందులు కలుగకుండా బారికేడ్లు, అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గణేశ్‌ నిమజ్జన ఊరేగింపు పూర్తిస్థాయిలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో  పటిష్ట భద్రత ఉంటుందన్నారు. డీజే సౌండ్స్‌ను వినియో గించ రాదన్నారు. ఏ సమస్య వచ్చినా డయల్‌ 100కు కాల్‌ చేయా లన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారుల సమన్వయంతో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్‌, సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సైలు శ్రీకాంత్‌, రాజు, దామోదర్‌, వినాయక ఉత్సవసమితి నిర్వాహకులు దార్ల సందీప్‌, రాపల్లి లక్ష్మీనారాయణ, గెంట్యాల శ్రీనివాస్‌, అకునూరి బాలరాజు, కల్లూరి మధు, వెంగల శ్రీనివాస్‌, ఎల్లయ్య యాదవ్‌,  మసీదుకమిటీ అధ్యక్షుడు యూసుఫ్‌, మైనారిటీ నాయకులు అక్రమ్‌, మునీర్‌, సలీం, ముస్తాఫా పాల్గొన్నారు.

ఫ కోనరావుపేట: గ్రామాల్లో వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని వేములవాడ డీఎస్పీ నాగేం ద్రచారి అన్నారు. కోనరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం వినాయక మంటపాల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కోనరావుపేట ఎస్‌ఐ రమాకాంత్‌, ఎంపీటీసీ చారి, పోకల సంతోష్‌ ఉన్నారు.

Read more