నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-03-23T06:23:24+05:30 IST

ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న పోలీసు, ఇతర ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు కాంపీటేటివ్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఎస్పీ రాహుల్‌ హెగ్డే

- ఈ నెల 27లోగా పేర్లు నమోదు చేసుకోవాలి

- ఏప్రిల్‌ మొదటి వారంలో అర్హత పరీక్ష

- ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, మార్చి 22: ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న పోలీసు, ఇతర ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు కాంపీటేటివ్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నెల 27లోగా అర్హులైన అభ్యర్థులు ఆయా పోలీస్‌స్టేషన్‌లలో పేర్లను  నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదుచేసుకున్న అభ్యర్థులందరికీ ఏప్రిల్‌ మొదటి వారంలో అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీయువకులను ప్రోత్సహించడానికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. 

 రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

పెండింగ్‌ చాలన్‌లపై ఉన్న రాయితీని  వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పిలుపునిచ్చారు. మార్చి 31లోగా ఎలాంటి వాహనాలకైనా రాయితీ వర్తిస్తుందని మరో ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉందని అన్నారు. ఆ తర్వాత అవకాశం కోల్పోతారన్నారు. ప్రధానంగా ద్విచక్రవాహనాలు, ఆటోలకు 75శాతం, ఫోర్‌ వీలర్స్‌, లారీలకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతం రాయితీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మాస్క్‌ధరించని వారు రూ.1000కి కేవలం రూ. 100 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ నెలాఖరులోగా చెల్లించని పక్షంలో ఏప్రిల్‌ 1న స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు.

Read more