Former MLA కీర్తి శేశులు బొమ్మ వెంకటేశ్వర్లు 3వ వర్ధంతి కార్యక్రమం

ABN , First Publish Date - 2022-03-18T17:05:52+05:30 IST

అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కీర్తి శేశులు బొమ్మ వెంకటేశ్వర్లు గారి 3వ వర్ధంతి కార్యక్రమంను ఘనం నిర్వహించారు. బొమ్మ వెంకటేశ్వర్లు గారి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు

Former MLA కీర్తి శేశులు బొమ్మ వెంకటేశ్వర్లు 3వ వర్ధంతి కార్యక్రమం

సిద్ధిపేట: అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కీర్తి శేశులు బొమ్మ వెంకటేశ్వర్లు గారి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనం నిర్వహించారు. బొమ్మ వెంకటేశ్వర్లు గారి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు జంగపెల్లి అయిలయ్య, లీడర్లు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బత్రికి ఉందంటే దానికి ముఖ్య కారణం బొమ్మ వెంకటేశ్వర్లేనని అయన గుర్తు చేశారు. 2004 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన హుస్నాబాద్‌ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని తెలిపారు. ఇందుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేశారని, హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన నిర్విరామంగా కృషిచేశారన్నారు. ముఖ్యంగా గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరులో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించిన ఘనత బొమ్మ వెంకన్నదేనని ఇప్పటికీ చెప్పుకుంటారని ఐలయ్య గుర్తు చేశారు. నియోజకవర్గం నుంచి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మవెంకన్నతనదైన ముద్ర వేసుకున్నారని ఐలయ్య తెలిపారు.


ఈ కార్యక్రమంలో కట్కూర్ సింగిల్విండో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గుగులోతు రాజు నాయక్, అక్కన్నపేట టౌన్ ప్రెసిడెంట్ పిరెళ్ల లింగమూర్తి, బంధారం రాజయ్య, చింతల బాలరాజ్ యూత్ నాయకులు చొక్కం గణేష్, నకీర్తి మునిరాజ్, గుగులోతు రాజు, బంధారం శ్రీనివాస్,ఉల్లెంగుల రాజు, పోతరబోయిన రాజు, కరోoటోతు రవి, చౌదరి శ్రీనివాస్, యటపోలు సంతోష్, సున్నపు అజయ్ కుమార్, బుద్ది రఘుపతి, బైరి రాకేష్, యాటపోలు రాజు, గుగులోతు సేవాలాల్, మొగిలి సురేష్, భూక్యా లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T17:05:52+05:30 IST