రైతులు రాజకీయ శక్తిగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-09-29T06:25:15+05:30 IST

రైతులు రాజకీయ శక్తిగా ఎదగాలని, తెలంగాణ బతుకమ్మ మరో మారు ఉద్యమ బతుకమ్మ కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు.

రైతులు రాజకీయ శక్తిగా ఎదగాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న గద్దర్‌

 ప్రజా గాయకుడు గద్దర్‌

 కోరుట్ల, సెప్టెంబరు 28: రైతులు రాజకీయ శక్తిగా ఎదగాలని, తెలంగాణ బతుకమ్మ మరో మారు ఉద్యమ బతుకమ్మ కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం మల్లాపూర్‌ మండలంలోని మెగిలిపేట గ్రామంలో నిర్వ హించే కార్యక్రమానికి వెలుతున్న గద్దర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెరుకు రైతు సంఘ అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు బద్దం శ్రీనివాస్‌ రెడ్డి, చెరుకు రైతు సంఘం ఉపాధ్యక్షుడు పాపన్న, సిఎస్‌ఆర్‌ పౌండెషన్‌ అదినేత శ్రీనివాస్‌రావులతో కలిసి మాట్లాడారు. బతుకమ్మను ఉద్యమ బతుకమ్మగా మర్చి ఓట్ల బతుకమ్మ వరకు తెచ్చిన రాజ కీయ పార్టీలకు బుద్ది చేపే విధంగా మరో మారు ఉద్యమ బతుకమ్మ మార నుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. మనీ, వైన్‌, భూ, ఓటు మ్యాపియాలు తయారు అవుతున్నాయని వాటి బారిన పడకుండా 18 నుండి 25 సంవత్సరాల యువత ఓటు హక్కు వినియోగంపై కుటుంబ సభ్యులతో చర్చించి అవినీతి నిర్మూలించే నాయకుడుని ఎన్నుకోవాలని అన్నారు. 1970 జగిత్యాల జైత్రయాత్రతో ఈ ప్రాంతం ఉద్యమానికి శ్రీకారం చుటిందని అన్నారు. ఓటు తూటాగా మర్చి నప్పుడే సమాజ నిర్మాణం సక్రంగా జరగుతుందన్నారు. చెరుకు కర్మాగారాలు రైతులకు అప్పగించేలా ప్రభుత్వం తీసుకునే విధంగా సంబదిత కర్మాగారం కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర మంత్రులను కలిసి వివరించాలని, సరియైన స్పందన లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తానని తెలిపారు. గల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వాలు స్పదించి పరిష్కరించాలని అన్నారు. ఈ సం దర్భంగా పలు అంశాలను పాటల రూపకంగా పాడుతూ గద్దర్‌ వివరించారు.  కార్యక్రమంలో రైతు నాయకులు, గల్ఫ్‌ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. 

యువకులు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి

మల్లాపూర్‌ : ఓటు తూటా లాంటిది, యువకులంతా ఆలోచించి మంచి నాయకుడి ఎన్నుకోవాలని ప్రజాగాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, గల్ఫ్‌ సంక్షేమ బోర్డు సాధన ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని మెగిలిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చక్కెర కర్మాగారం తెరిపిస్తే ఉపాధికి విదేశాలకు వెళ్లరని, ఉపాధి ఇక్కడే దొరుకుతుందన్నారు. దీనికి కృషిచేస్తున్న ఫౌండేషన్‌ వివరాలను గద్దర్‌ అడిగి తెలుసుకున్నారు. చెరుకు రైతులు ఐక్యం కావాలని అప్పుడు ఫాక్టరీ ఖచ్చితంగా తెరుచుకుటుందన్నారు. దుబాయ్‌ వలసలు కూడా ఆగుతాయని గద్దర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతు సంఘ అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు బద్దం శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు రైతు సంఘం ఉపాధ్యక్షుడు పాపన్న, రైతు నాయకులు పాల్గొన్నారు. 

Read more