చుక్కల మందుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-02-23T05:53:22+05:30 IST

పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఈనెల 27వ తేదీన జిల్లాలో పల్స్‌ పోలియో కార్య క్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చుక్కల మందుకు కసరత్తు

ఫైల్‌ నం.02జెజిటి21


పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి, జగిత్యాల

 ఈనెల 27న పల్స్‌ పోలియో

 ఏర్పాట్లు చేస్తున్న వైద్య శాఖ అధికారులు

జగిత్యాల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఈనెల 27వ తేదీన జిల్లాలో పల్స్‌ పోలియో కార్య క్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. 27న చుక్కల మందు వేసుకోని వారికి తదుపరి 28వ తేదీ మార్చి 1వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేయా లని సూచించింది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగస్వామయ్యే ఉద్యోగులు, సిబ్బం దికి శిక్షణను సైతం అందిస్తున్నారు. 

జిల్లాలో 92,225 చిన్నారుల గుర్తింపు....

పోలియో చుక్క మందును వేసేందుకు జిల్లాలో ఐదేళ్ల లోపు బాల బాలికలను వైద్య శాఖ అధికారులు గుర్తించారు. వీరికి ఈనెల 27వ తే దిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలి యో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు వయస్సు గల చిన్నారులు 92,225 ఉన్నట్లు గుర్తించారు. 

507 కేంద్రాల్లో...

జిల్లా వ్యాప్తంగా 507 కేంద్రాల్లో పోలియో చుక్కలను వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయిక ల్‌, ధర్మపురి మున్సిపాల్టీల్లో 75 కేంద్రాలు, 380 గ్రామ పంచాయతీల్లో 432 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి తోడు జిల్లాలో 22 మొ బైల్‌ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 17 మొ బైల్‌ బూత్‌లు, పట్టణాల్లో 5 మొబైల్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు.  ఒక్కో బూత్‌లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే వి ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పల్స్‌ పోలియోకు 2,028 మంది సేవలు...

ఒక్కో పల్స్‌ పోలియో కేంద్రంలో 4 గురు వ్యక్తులు విధులు నిర్వహిం చనున్నారు. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 2,028 మంది సిబ్బంది అ వసరమవుతారన్న అంచనాలు వేశారు. ఇందులో 253 మంది ఆరోగ్య సిబ్బంది, 795 మంది అంగన్‌ వాడీ టీచర్లు, 764 మంది ఆశా వర్కర్లు, 216 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, వలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. పది పల్స్‌ పోలియో కేంద్రాలకు ఒ క రూట్‌ సూపర్‌ వైజర్‌ను నియమిస్తున్నారు. ఇందుకు గాను జిల్లాలో 51 మంది రూట్‌ సూపర్‌వైజర్లు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక మొబైల్‌ టీం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పీహెచ్‌సీల పరిధిలో 22 మొబైల్‌ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. 

మురికివాడలపై ప్రత్యేక దృష్టి....

జిల్లాలో మురికి వాడలు, కన్‌స్ట్రక్షన్‌ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రాంతాల్లో సంబంధిత టీంలు పర్యటించి చిన్నారులకు పోలియో చుక్క లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 212 ప్రాంతాలను హైరిస్క్‌గా అధికారులు గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటు న్నారు.  రూట్‌ సూపర్‌వైజర్లు, మొబైల్‌ టీం సభ్యులకు 73 వాహనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లాలోని బస్టాండులు, రైల్వే స్టేషన్లలో 12 టాన్సిట్‌ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే...

పోలియో చుక్కలను వేసే సిబ్బందితో పాటు కేంద్రాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. శానిటైజర్‌తో చేతులు శుభ్రచేసుకోవడం, భౌ తిక దూరం పాటించడం వంటివి జరపాలని సూచిస్తున్నారు. కరోనా సాకుతో చుక్కల మందు వేయించుకోకుండా ఉండొద్దని ప్రచారం చేస్తు న్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేసే సిబ్బంది సైతం కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని ఇమ్యూనైజేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

పకడ్బందీగా నిర్వహిస్తాం

- బీఎస్‌ లత, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, 

జిల్లాలో పల్స్‌ పోలియోను పకడ్భందీగా నిర్వహిస్తాము. సమాజం లోని అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేసి వంద శాతం విజయవం తం చేయడంపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇందుకు అవసరమైన అవగాహన సమావేశం నిర్వహించాము.

ఏర్పాట్లు చేస్తున్నాము

- పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి, జగిత్యాల

జిల్లాలో పల్స్‌ పోలియోను లక్ష్యం మేరకు నిర్వహించడానికి అవస రమైన ఏర్పాట్లు చేస్తున్నాము. పల్స్‌ పోలియో కార్యక్రమానికి అవసర మైన సిబ్బంది అంచనా, 0 నుంచి 5 సంవత్సరాల్లోపు వయస్సు గల చిన్నారుల గుర్తింపు పూర్తి చేశాము. వంద శాతం లక్ష్యం సాధిస్తాము.

Read more