ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-28T05:06:09+05:30 IST

ప్రతి దళితునికి దళిత బంధు పథకం ఇవ్వాల ని ప్రభుత్వాని కాంగ్రెస్‌ పార్టీ రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న మక్కాన్‌సింగ్‌

- కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని, సెప్టెంబరు 27: ప్రతి దళితునికి దళిత బంధు పథకం ఇవ్వాల ని ప్రభుత్వాని కాంగ్రెస్‌ పార్టీ రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి యుగేంధర్‌ ఆధ్వర్యంలో కాం గ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ 50వ డివిజన్ల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలోని నాయకులకే దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అందరికి దళిత బంధు పథకం ఇవ్వాలని, కేవలం ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ నాయకులకే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు.ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను దళితబంధుగా మార్చి అవసరాల కోసం పార్టీలో చేరేవారికే దళిత బంధు ఇవ్వడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కాల్వ లింగస్వామి, నాయకులు మాదరబోయిన రవికుమార్‌, పెండ్యాల మహేష్‌, నాజీమోద్దీన్‌, దా సరి విజయ్‌కుమార్‌, ఫజల్‌బేగ్‌, నాజీమ్‌, ప్రసాద్‌, రంజిత్‌ పాల్గొన్నారు. 

Read more