ప్రతీ పౌరుడు ఓటు హక్కు పొందాలి

ABN , First Publish Date - 2022-09-09T05:05:25+05:30 IST

జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి అన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్‌ హాల్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ప్రతీ పౌరుడు ఓటు హక్కు పొందాలి
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికారులు

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి అన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్‌ హాల్‌లో  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.   పారదర్శక ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు వీలుగా మరణించిన వారి వివరాలను సేకరించాలని సూచించారు.   ప్రతీ ఓటరు   ఆధార్‌ కార్డ్‌ను ఓటరు కార్డుతో అనుసంధానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. సిస్టమెటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలకో్ట్రల్‌ పార్టిసిపేషన్‌ప్రోగ్రాం పేరిట ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా అదనపు డీఆర్‌డీవో మదన్‌ మోహన్‌, ఎన్నికల ఉప తహసీల్దార్‌ రెహమాన్‌ పాల్గొన్నారు.


Read more