రైతు సంక్షేమానికి కేంద్రం భరోసా

ABN , First Publish Date - 2022-06-11T06:20:11+05:30 IST

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ పధకాలు భరోసా కల్పిస్తున్నాయని జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు అన్నారు.

రైతు సంక్షేమానికి కేంద్రం భరోసా

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు

జగిత్యాలరూరల్‌, జూన్‌ 10: రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ పధకాలు భరోసా కల్పిస్తున్నాయని జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని పొలాస బూత్‌ నెంబర్‌ 117, 119 లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి, నాయకులు గణేష్‌, రమేష్‌, దామోదర్‌, రాజు, రాజశేఖర్‌, మల్లయ్య, రాజేశం, రాజశేఖర్‌, తిరుపతి, మనోహర్‌, పోలింగ్‌బూత్‌ అధ్యక్షు తదితరులు పాల్గొన్నారు.


Read more