వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకే ఆంగ్ల శిక్షణ

ABN , First Publish Date - 2022-03-23T05:34:47+05:30 IST

ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధిం చేందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ప్ర త్యేక శిక్షణనిస్తున్నట్లు డీఈవో డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకే ఆంగ్ల శిక్షణ
వెల్గటూర్‌లో మాట్లాడుతున్న డీఈవో జగన్‌మోహన్‌ రెడ్డి

- డీఈవో డాక్టర్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

వెల్గటూర్‌, మార్చి 22: ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధిం చేందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ప్ర త్యేక శిక్షణనిస్తున్నట్లు డీఈవో డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మం గళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ని ర్వహిస్తున్న ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఎన్రిచ్‌మెంట్‌ కోర్స్‌ శిక్షణ శిబిరాన్ని ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో చర్చా గోష్టి నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులతో ఆంగ్లంలో మాట్లాడించారు. ఈ సందర్భం గా డీఈవో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుం చి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్య మంలో బోధించేలా శిక్షణనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఇం గ్లీష్‌లో మాట్లాడడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యా యులు సమయపాలన పాటిస్తూ, శిక్షణ శిభిరాలలో పొందిన జ్ఞానాన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అందించాలన్నారు. పిల్లల్లో మంచి ఆంగ్ల భా ష కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి చేసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులను చేయాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమాన్ని విజ యవంతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బత్తుల భూమయ్య, కోర్స్‌ డైరెక్టర్‌ లచ్చయ్య, మెంటార్స్‌ శ్రీదేవి, కుమారస్వామి, రాజేష్‌, సీఆర్పీ వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు

పదవ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం వెల్గటూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ని ర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థు లు ప్రత్యేక తరగతుల్లో తీరును పరిశీలించి వారికి తగు సూచనలిచ్చా రు. విద్యార్థులచే బోర్డ్‌పై స్వయంగా రాయించారు. విద్యార్థులు ఏకాగ్రత తో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సబ్జెక్ట్‌లలో వచ్చిన సందేహాలను సంబంధిత ఉపాధ్యాయలచే నివృత్తి చేసుకోవాల న్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి, సమయం వృధా చేయ కుండా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధి కారి బత్తుల భూమయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-23T05:34:47+05:30 IST