విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:44:01+05:30 IST

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుఽలు ధర్నా చేపట్టారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఏవోకు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 4: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుఽలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా  పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేయలేదన్నారు.  తక్షణమే పాఠ్యపుస్తకాలను విడుదల చేయాలని, ప్రతీ విద్యార్ధికి రెండు జతల యూనిఫాం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలన్నారు. మధ్యాహ్న భోజనానికి నిధులు  పెంచాలని, పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజనం బిల్లులను విడుదల చేయాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులతోపాటు మండల విధ్యాధికారులను నియమించాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో గంగయ్యకు వినతి పత్రం అందజేశారు.  జిల్లా అధ్యక్షుడు మంద అనిల్‌కుమార్‌, నేహ, గుండెల్లి కళ్యాణ్‌కుమార్‌, జూలపల్లి మనోజ్‌, కుర్ర రాకేష్‌, భాదవేణి రాము, సోల్లు సాయి, రాహూల్‌, కావ్య, రాకేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:44:01+05:30 IST