రాష్ట్రంలో విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-10-01T05:06:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్వవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

రాష్ట్రంలో విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

రాయికల్‌, సెప్టెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్వవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని  ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లో మహాత్మాజ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలో రూ.38లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ,  డ్రైన్‌, ప్రహారీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 1000కి పైగా ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసిందని అన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతుందని  ఒక్కోవిద్యార్థిపై లక్షకు పైగా ఖర్చు చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల  విద్యుత్‌, తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అత్తినేని గంగరెడ్డి, ఎంపీటీసీ మోర విజయలక్ష్మీ, సింగిల్‌విండో చైర్మన్‌ రాజలింగం, వైస్‌ఎంపీపీ మహేశ్వర్‌రావు, ఉపసర్పంచ్‌ సాగర్‌రావు, కోఆప్షన్‌ ముఖీద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more