దసరా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

ABN , First Publish Date - 2022-10-05T05:45:11+05:30 IST

మండల ప్రజ లందరూ దసరా ఉత్సవా లను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ సారంగ పాణి అన్నారు.

దసరా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
ఉత్సవాల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ, తహసీల్దార్‌

- ఏసీపీ సారంగపాణి

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబరు 4: మండల ప్రజ లందరూ దసరా ఉత్సవా లను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ సారంగ పాణి అన్నారు. మంగళవారం ఏసీపీ మండల కేంద్రంలోని జమ్మి పూజ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఏసీపీ మాట్లాడు తూ మండల ప్రజలకు దుర్గామాత, దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో అత్యంత ప్రధాన మైన గొప్ప పండుగ దసర అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో శాంతియు తంగా పండుగ జరుపుకోవాలన్నారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మండల ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ అనుపమ, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రాజా వర్ధన్‌, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవిరాజు పాల్గొన్నారు. 

Read more