దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం

ABN , First Publish Date - 2022-10-04T06:42:58+05:30 IST

దసరా ఉత్సవాలను గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. సోమవారం జవహర్‌ లాల్‌ నెహ్రూస్టేడియంలో దసరా ఉత్సవాల పనులను ఆయన ప్రారంభించారు.

దసరా  ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చందర్‌


- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 3: దసరా ఉత్సవాలను గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. సోమవారం జవహర్‌ లాల్‌ నెహ్రూస్టేడియంలో దసరా ఉత్సవాల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల ను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు, క్రాకర్స్‌తో పాటు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్టేడియానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన కార్పొరేషన్‌ అధికా రులకు సూచించారు. ఆయన వెంట మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు కొమ్ము వేణు, పాముకుంట్ల భాస్కర్‌, దొంత శ్రీనివాస్‌, నాయకులు దీటి బాలరాజు, తోడేటి శంకర్‌గౌడ్‌, నారాయణ దాసు మారుతి, ఐ సత్యం, అడప శ్రీనివాస్‌, జేవీ రాజు, మొహిద్‌ సన్ని, నీరటి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Read more