సీజనల్‌ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-10-11T05:51:46+05:30 IST

కొవిడ్‌, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు ఒకే మాదిరిగా ఉంటున్నాయని, నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేసి చికిత్స అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

సీజనల్‌ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు
సీటీస్కాన్‌ను పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

సిరిసిల్ల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు ఒకే మాదిరిగా ఉంటున్నాయని, నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేసి చికిత్స అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. సోమవారం  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో సమావేశమై పలు సూచనలు చేశారు.  సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, ఇతర వ్యాధులకు చికిత్స  అందించడానికి మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు  డాక్టర్లను, మందులను అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో ప్రతీ పల్లెకు వైద్యం చేరే విధంగా ఇంటింటా జ్వరం సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో జబ్బుల బారిన పడిన వారిని గుర్తించాలని, చికిత్స అందించాలని సూచించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మురళీధర్‌ రావు, డాక్టర్‌ తిరుపతి, ఆర్‌ఎంవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-11T05:51:46+05:30 IST