వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-12-31T00:28:31+05:30 IST

మండలంలోని పలువురు వికలాంగులకు మండ ల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ ట్రై సైకిళ్లను, బ్యాటరీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వికాలంగ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు.

వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ
కొడిమ్యాలలో ట్రై సైకిళ్లను అందిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

కొడిమ్యాల, డిసెంబరు 30 : మండలంలోని పలువురు వికలాంగులకు మండ ల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ ట్రై సైకిళ్లను, బ్యాటరీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వికాలంగ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డ్డి, కొడిమ్యాల, పూడూర్‌ సింగిల్‌ విండోల చైర్మనులు రాజన ర్సింగరావు, రవీందర్‌రెడ్డ్డి, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, ఎంపీటీసీ మల్లారెడ్డ్డి, లక్ష్మన్‌, జగన్‌మొహన్‌రెడ్డ్డి, సర్పంచులు స్వామిరెడ్డ్డి, మహిపాల్‌, ఎంపీడీవో పద్మజరాణి, ఐసీడీఎస్‌ సీడీపీవో నర్సింగరాణి తదితరులు పాల్గొన్నారు.

ఫ మల్యాల : మండలంలోని మల్యాల శివారు నుంచి బల్వంతాపూర్‌ క్రాస్‌ రోడ్డు వరకు రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.29కోట్లు మంజూరు చేయగా ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవిశంకర్‌ను గురువారం బల్వంతాపూర్‌ గ్రామస్థులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రమేశ్‌, విండో చైర్మన్‌ రాంలింగారెడ్డి, మాజీ ఎంపీపీ తైదల శ్రీలత గ్రామస్థులు పాల్గొన్నారు.

ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎమ్మెల్యే రవిశంకర్‌ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ మిట్టపెల్లి విమల, జడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్‌రావు, ఐసీడీఎస్‌ పీడీ నరేశ్‌, సీడీపీవో నర్సింగరాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:28:31+05:30 IST

Read more