పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు దూరం

ABN , First Publish Date - 2022-08-01T06:29:07+05:30 IST

పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు దరి చేరవని జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు దూరం
వార్డులో పర్యటిస్తున్న చైర్‌ పర్సన్‌

జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి

జగిత్యాల టౌన్‌, జూలై 31: పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలు దరి చేరవని జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు. ఆదివారం పట్టణంలోని 21వ, వార్డులో చైర్‌ పర్సన్‌ శ్రావణి పర్యటించారు. నీరు నిలి చిన ప్రదేశాల్లో దోమలు ప్రబలకుండా ఆయిల్‌ బాల్స్‌ వేయించారు. ఈ కా ర్యక్రమంలో కౌన్సిలర్‌ అల్లె గంగ సాగర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు యెల్లం, అశోక్‌ ఉన్నారు. అనంతరం 37వ వార్డులో కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మన కోసం మన ఆరోగ్యం అనే కార్యక్రమంలో చైర్‌ పర్సన్‌ శ్రావణి పాల్గొ ని కుండీలు, కూలర్లలో ఉన్న నీటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ పీ హరిత, అంగన్‌ వాడీ టీచర్‌ సౌజన్య, వార్డు అధికారి ఉన్నారు.

Read more