త్వరలో అందుబాటులోకి డిజిటల్‌ లైబ్రరీ

ABN , First Publish Date - 2022-03-04T06:14:12+05:30 IST

పాఠకులకు డిజిటల్‌ గ్రంథాలయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నారు.

త్వరలో అందుబాటులోకి డిజిటల్‌ లైబ్రరీ
లైబ్రరీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 3: పాఠకులకు డిజిటల్‌ గ్రంథాలయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ లైబ్రరీని గురువారం నగరపాలక సంస్థ కమిషనర్‌ సేవ ఇస్లావత్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ గ్రంథాలయాన్ని త్వరలో పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం డిజిటల్‌ గ్రంథాలయం భవన నిర్మాణ డీపీఆర్‌లను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. 

ఫ రోడ్లపై కూరగాయలు విక్రయించవద్దు...

టెలిఫోను భవన్‌ రోడ్డు మార్గంలో రోడ్డుపై కూరగాయలు విక్రయించవద్దని అదనపు కలెక్టర్‌ అగర్వాల్‌ అన్నారు. గురువారం టెలిఫోను భవన్‌ రోడ్డులోని కూరగాయల విక్రయదారులతో ఆమె మాట్లాడారు. రోడ్డుపై కూర్చొని కూరగాయలు విక్రయించడం వలన వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అనంతరం సప్తగిరికాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న మార్కెట్‌ను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


Updated Date - 2022-03-04T06:14:12+05:30 IST