-
-
Home » Telangana » Karimnagar » Development works should be completed during Dussehra-NGTS-Telangana
-
దసరాలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-08-31T05:31:38+05:30 IST
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అభివృద్ధి పనులను దసరాలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు

సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 30: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అభివృద్ధి పనులను దసరాలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులు, అంగన్‌వాడీలు, అరోగ్య ఉపకేంద్రాలు, డే కేర్‌సెంటర్‌లు, భవిత సెంటర్, డబుల్ బెడ్ రూం ఇళ్లు మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రగతిలో ఉన్న 9 మోడల్ అంగన్‌వాడీలను, జిల్లాకు మంజూరైన 20 అంగన్‌వాడీలను ఇప్పటికే 16 టెండర్లు పూర్తయినందున నిర్మాణ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అన్నారు. ఆరు సంక్షేమ వసతి గృహాల పునరుద్ధరణ , అధునికీకరణ పనులను సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలన్నారు. ఎల్లారెడ్డిపేటలోని డే కేర్ సెంటర్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ రరాజ్ ఇంజనీర్ సూర్యప్రకాష్, డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.