అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-03-04T05:57:18+05:30 IST

జిల్లాలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అదేశించారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అదేశించారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీరాజ్‌ ద్వారా 854 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేప ట్టగా 199 పూర్తి చేశారని 21 ప్రగతిలో ఉన్నట్లు, 170 నిర్మాణాలను అగ్రిమెంట్లు జరిగినట్లు తెలిపారు. మరో 428 నిర్మాణాలకు టెండర్లకు అహ్వానించినట్లు తెలిపారు. సొంత స్థలం ఉండి సొసైటీగా ఏర్పడిన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో 214 అంగన్‌వాడీ కేంద్ర భవనాలు మంజూరు కాగా 106 పూర్తయినట్లు, 36 ప్రగతిలో ఉండగా 72 పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. పనులు ప్రా రంభంకాని చోట సమస్యలను అధిగమించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రగతిలో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు. 34 నూత న గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు మంజూరు కాగా నాలుగు చోట్ల పూర్తయ్యాయని 26 చోట్ల ప్రగతి లో ఉండగా నాలుగు భవనాల నిర్మాణాలు ప్రారంభం కాలేదని అన్నారు. జిల్లాలో 463 సీసీ రోడ్ల నిర్మాణాలు మంజూరు కాగా 347 చోట్ల పనులు గ్రౌండింగ్‌ చేశార ని అన్నారు. 35 హెల్త్‌ సబ్‌ సెంటర్లు మంజూరు కాగా ఐదు పూర్తి చేశారని 29 చోట్ల పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. పనుల పురోగతిపై ప్రతి రోజు సమీక్షించాలని క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తూ పనుల పర్యవేక్షణ చేయాలని సూచించారు. నాణ్యత విష యంలో రాజీ పడవద్దని అన్నారు. సమావేశంలో అద నపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, పంచాయతీరాజ్‌ ఈఈ సూర్యప్రకాష్‌, అర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంలు పాల్గొన్నారు. 


Read more