ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-09-18T05:28:31+05:30 IST

ప్రజలంతా ఐక్యంగా ఉంటే నే అభివృధ్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చెర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

- మత విద్వేషాలను తిప్పికొడుదాం 

- ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ 

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 17: ప్రజలంతా ఐక్యంగా ఉంటే నే అభివృధ్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చెర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక జూనియర్‌ కాలేజీ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన వినోద్‌కుమార్‌ గౌరవ వందనం స్వీకరించిన అనం తరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్‌ 17కు ఒక విశిష్టత ఉందని, 74 ఏళ్ళ క్రితం తెలంగాణ భారత దేశంలో అంతర్భాగంగా మారిందని ఆయన వివరించారు. జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదని, ప్రజల మధ్య విభిన్న జాతుల, సంస్కృతుల సమైక్యతని అయన అభివర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే అసలైన దేశ భక్తి అని పేర్కొన్నారు. 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో తెలంగాణ 60 ఏళ్ళపాటు అస్తిత్వం కోసం పోరాటం చేసిందన్నారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతోంద న్నారు. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ గా నిలిచిందని వివరించారు. తెలంగాణ ప్రజలు ఏకమై చేసి న పోరాట చరిత్రను వక్రీకరిస్తూ విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉం డాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సంగీతస త్యనారాయణ, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు లక్ష్మీనా రాయణ, కుమార్‌దీపక్‌, రఘువీర్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి, ఆరెపల్లి మోహన్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, ఏసీ పీ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T05:28:31+05:30 IST