కూష్మాండ అలంకారంలో అమ్మవారి దర్శనం

ABN , First Publish Date - 2022-09-30T05:08:00+05:30 IST

వేములవాడ రాజరాజే శ్వర క్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు గురువారం కూష్మాండ అవతార అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.

కూష్మాండ అలంకారంలో అమ్మవారి దర్శనం
కూష్మాండ అలంకారంలో అమ్మవారు

- భక్తుల ప్రత్యేక పూజలు

వేములవాడ, సెప్టెంబరు 29: వేములవాడ రాజరాజే శ్వర క్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు గురువారం కూష్మాండ అవతార అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశరన్నవరాత్రి ఉత్సవాల నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి సందర్భంగా స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి అభ్యంగన స్నానం, మహాభిషేకం, లలిత సహస్రనామ సహిత చతుష్షష్ట్యోప చార పూజలను నిర్వహించిన అనంతరం అమ్మవారిని కూష్మాండ అలంకారంతో అలంకరించారు.

నాగిరెడ్డి మండపంలో హోమం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భాగవత పురాణ ప్రవచనం చేశారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారు, ప్రధాన ఆలయంలో బాలాత్రిపురసుందరి అమ్మవారు, మహిషాసుర మర్ధిని అమ్మవారు ప్రత్యేక పూజలందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం తో పాటు అనుబంధ ఆలయాలలో భక్తులు స్వామివారలు, అమ్మవారలను దర్శించుకున్నారు.

Read more