ఆర్ధిక స్వావలంబన కోసమే దళితబంధు

ABN , First Publish Date - 2022-02-23T05:54:46+05:30 IST

దళిత కుటుంబాలు ఆర్ధిక స్వావలంబన సాధించాలనే లక్ష్యం కోసమే ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందని కలెక్టర్‌ రవి అన్నారు.

ఆర్ధిక స్వావలంబన కోసమే దళితబంధు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులదే పూర్తిస్వేచ్చ 

దళిత బంధు యూనిట్ల ఎంపిక అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ రవి  

జగిత్యాల అర్బన్‌, ఫిబ్రవరి 22: దళిత కుటుంబాలు ఆర్ధిక స్వావలంబన సాధించాలనే లక్ష్యం కోసమే ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేసిందని కలెక్టర్‌ రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వీకేబీ ఫంక్షన్‌ హాల్‌లో జగిత్యాల, చొప్ప దండి(రెండు మండలాల) నియోజకవర్గాలకు పరిధిలో ఎంపి క చేసిన లబ్ధిదారులకు మంగళవారం ఏర్పాటు చేసిన దళిత బంధు యూనిట్ల ఎంపిక అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌  పాల్గొన్నారు. ఆర్థికంగా దళితులు పేదరికం నుంచి పూర్తిస్థా యిలో బయటకు రావాలని సీఎం కేసీఆర్‌ దళితబంధు పథ కం రూపొందించారన్నారు. తొలి ఏడాది ప్రతి అసెంబ్లీ నియో జకవర్గం పరిధిలో ఫైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద 100 మంది లబ్ధిదా రులను ఎంపిక చేశామన్నారు. లబ్ధిదారుల ధృవీకరణ సమ యంలో వారికి ఆసక్తి ఉన్న యూనిట్ల వివరాలను సేకరించా మని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం అందించే అవకాశాన్ని పూ ర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళితబంధు కింద వివిధ రంగాల్లో ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్న యూనిట్ల వివరాలను అధికారులు వివరిస్తారని, వాటిని పరి శీలించి ఆసక్తి, పూర్వ అనుభవం, నైపుణ్యం ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. దళితబంధు యూనిట్‌ ఎంపికలో పూర్తిస్థాయిలో స్వేచ్చ లబ్ధిదారుడికి ఉందని, అధికా రులు కేవలం అవగాహన మాత్రమే కల్పిస్తారని అంతిమ ని ర్ణయం లబ్ధిదారుడేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం అం దించిన రూ.10లక్షల నగదులో రూ.9.9లక్షల నిధులను యూ నిట్‌ ఏర్పాటు సమయంలో విడుదల చేస్తామన్నారు. లబ్ధిదా రుడి రూ.10వేలకు ప్రభుత్వం మరో 10వేలు కలిపి దళిత రక్ష ణ నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇది భవిష్యత్‌లో ఈ కు టుంబాలకు ప్రమాదవశాత్తు ఆపదవస్తే ఈ నిఽధుల నుంచి సహాయం అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈడీ ఎస్‌సీ కార్పొ రేషన్‌ లక్ష్మీనారాయణ, జిల్లా సివిల్‌ సప్లై అధికారి చందన్‌ కుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భిక్షపతి, వ్యవసా య శాఖ అధికారి సురేష్‌కుమార్‌, ఆయా మండలాల ఎంపీ డీవోలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Read more