దేశానికి ఆదర్శంగా నిలవనున్న దళితబంధు

ABN , First Publish Date - 2022-10-03T06:03:14+05:30 IST

దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలువనుందని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

దేశానికి ఆదర్శంగా నిలవనున్న దళితబంధు
ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

వేములవాడ టౌన్‌, అక్టోబరు 2:  దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలువనుందని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. వేములవాడ మండలం మారుపాకలో దళితబంధు లబ్ధిదారుడు ఏర్పాటు చేసిన సెంట్రింగ్‌, మెటిరీయల్‌ వర్క్‌ షాపును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్థిక అభివృద్ధికి సీఎం పథకం తీసుకొచ్చారన్నారు.  మొదటగా గ్రామాల్లో కొంత మందిని ఎంపిక చేసి దళితబంధుతో ఆర్థిక స్వాలంబన కల్పిస్తున్నట్లు చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి దళితబంధు పథకం అందుతుందన్నారు. అనంతరం చీర్లవంచలోని నిర్వాసితులకు ఇళ్ల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.  స్థానిక సర్పంచ్‌ చెన్నమనేని స్వయంప్రభ, జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ వజ్రవ్వ, వైస్‌ ఎంపీపీ ఆర్సీరావు, సర్పంచులు రాసూరి రాజేశం, కొండపల్లి వెంకటరమణరావు, గుర్రం లక్ష్మారెడ్డి, రేగులపాటి రాణి హరిచరణ్‌రావు, రాంరెడ్డి నాయకులు చెలుకల తిరుపతి, కొమురవ్వ, మేర్గు జల తదితరులు ఉన్నారు. 

Read more