పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్‌ దోహదం

ABN , First Publish Date - 2022-09-25T06:14:58+05:30 IST

సైక్లింగ్‌ క్రీడ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్‌ దోహదం
జెండా ఊపి రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

- అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ 

- రాష్ట్రస్థాయి రోడ్‌ సైక్లింగ్‌ పోటీలు ప్రారంభం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 24: సైక్లింగ్‌ క్రీడ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వెలిచాల క్రాస్‌ రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఏడవ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల రోడ్‌ సైక్లింగ్‌ పోటీలను ఆయన జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఓపిక, సహనం చాలా అవసరమన్నారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత, సైక్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడలను అల్ఫోర్స్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పోటీలను సీపీ సత్యనారాయణ, టౌన్‌ ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు, ట్రాఫిక్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, రూరల్‌ ఏసీపీ టి కరుణాకర్‌ జెండాలు ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో  కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, టెక్నికల్‌ పరిశీలకులు మ్యాక్స్‌వెల్‌, గట్టుబుత్కూర్‌ సర్పంచ్‌ కంకణాల విజయేందర్‌రెడ్డి, సైక్లింగ్‌ సంఘ కార్యదర్శి దత్తాత్రేయ, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బి మధుసూదన్‌రెడ్డి,   ఒలింపిక్‌ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, వి జగదీశ్వరాచారి, ఇ రమేశ్‌, జిల్లా కార్యదర్శి ఎస్‌ వేణుగోపాల్‌, నర్సయ్య, డీవైఎస్‌వో కీర్తి రాజవీరు పాల్గొన్నారు. 

Read more