రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-10-08T05:58:29+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది.

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
స్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

వేములవాడ, అక్టోబరు 7 :  వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజల్లో పాల్గొన్నారు. కళాభవన్‌లో  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవలు నిర్వహించారు.  సర్వదర్శనం క్యూలైన్‌, కోడెమొక్కుల క్యూలైన్‌తోపాటు ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.  


Read more