రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-10-03T06:04:03+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ, అక్టోబరు 2: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని, ప్రత్యేక పూజలందుకుంటున్న  రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read more