ఎన్టీపీసీ అధికారులపై కార్పొరేటర్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-09-28T05:01:35+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావే శానికి హాజరైన ఎన్టీపీసీ హెచ్‌ఆర్‌ అధికారులపై ప్రభావిత ప్రాంత కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు.

ఎన్టీపీసీ అధికారులపై కార్పొరేటర్ల ఆగ్రహం
మాట్లాడుతున్న మేయర్‌ అనీల్‌ కుమార్‌

- ప్రభావిత ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపణ

- సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించకపోవడంపై నిలదీత

కోల్‌సిటీ, సెప్టెంబరు 27: రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావే శానికి హాజరైన ఎన్టీపీసీ హెచ్‌ఆర్‌ అధికారులపై ప్రభావిత ప్రాంత కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. ఎన్టీపీసీతో పూర్తిగా నష్టపోయిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తు న్నారని, అభివృద్ధి పనులు చేపట్టకుండా దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపించారు. మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన స మావేశంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కన్నూరి సతీష్‌కుమార్‌ ఈ అంశాన్ని లేవనెత్తా రు. ఎన్టీపీసీ అధికారులు అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదని, తాము కొత్తగా వచ్చా మంటూ తప్పించుకుంటున్నారని, ఇంతలోనే వారు బదిలీ అయి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. కొవిడ్‌కు, ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇచ్చామంటూ దాట వేస్తున్నామన్నారు. డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్‌, కృష్ణవేణి, నీల పద్మ, వెంకటరమణారెడ్డి తదితరులు ఎన్టీపీసీ వైఖరిని తప్పుబట్టా రు. దీనిపై ఎన్టీపీసీ అధికారులు మాట్లాడుతూ ప్రతి పాదనలు కలెక్టర్‌ ఆమోదిం చిన తరువాతనే కేటాయింపులు జరుపుతామని పేర్కొన్నారు. దీనిపై కార్పొరేటర్లు గరమయ్యారు. త్వరలోనే ప్రభావిత ప్రాంత కార్పొరేటర్లు, ఎన్టీపీసీ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ సుమన్‌రావు హామీ ఇచ్చారు. అధి కార పార్టీ కార్పొరేటర్‌ బాదె అంజలి మాట్లాడుతూ తన డివిజన్‌ పరిధిలో కాం ట్రాక్టర్లు పనులు చేయడంలేదని, ప్రశ్నిస్తే బిల్లులు రావడం లేదని చెబుతున్నారన్నా రు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ సాగంటి శంకర్‌ మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నస్పూర్‌ తదితర ప్రాంతాల్లో సింగరేణి స్థలాల్లో ఇప్పటికే పట్టాలు ఇచ్చారని, రామ గుండంలో ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ జావిద్‌ జీఓ నెం.76కు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా పట్టాలకు సంబం ధించి డిమాండ్‌ నోటీసు ఇస్తున్నామన్నారు. సింగరేణి ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు పూర్తి గా శిథిలమయ్యాయని, వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని కార్పొరేటర్‌ మహం కాళి స్వామి సింగరేణి డీజీఎం నవీన్‌ను కోరారు. ఈ సమావేశంలో బతుకమ్మ పం డుగ సందర్భంగా గుంతలను పూడ్చి నేలను చదును చేయడానికి డివిజన్‌కు రూ. లక్ష చొప్పున రూ.50లక్షలు, లైటింగ్‌ ఏర్పాట్లకు రూ.12.75లక్షలు కేటాయించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియలో ఉన్న బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు సంబంధించిన రూ.20లక్షల పనులకు సంబంధించి 3,4,5, 6 అంశాలు తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఫైర్‌ క్రాకర్‌షో, రామ్‌లీలకు సంబంధించి రూ.6.7లక్షలు కేటాయించారు. దీంతోపాటు స్వచ్ఛ ఆటోల మరమ్మతులకు రూ.12.5లక్షలు, సమ్మక్క -సారలమ్మ గద్దెల వద్ద డంపింగ్‌ జరిగిన ప్రాంతంలో లెవలింగ్‌, సుందరీకరణకు రూ.35లక్షలు కేటాయించారు. ఈ అంశాలను టేబుల్‌ ఎజెండాగా తీసుకువచ్చారు. మేయర్‌ అనీల్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కమిషనర్‌ సుమన్‌రావు, ఎన్‌టీపీసీ డీజీఎం(హెచ్‌ఆర్‌) సరేంద్ర త్రివే ది, అధికారి నిశాంతి తివారి, సింగరేణి అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:01:35+05:30 IST